రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కశ్మీర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు బయలుదేరి వెళతాం అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అందుకే హాత్ సే హాత్ జోడో యాత్రను కొద్దిరోజులు వాయిదా వేసుకున్నామని తెలిపారు.
ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీ లు బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు.. కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని తెలిపారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.