ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా గొప్పగా రాణించవచ్చు : తలసాని

-

కింగ్ కోఠి లోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కాలేజీ లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో వివిధ కాలేజీల విద్యార్ధులతో శనివారం సినీ వాల్యుషన్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా గొప్పగా రాణించవచ్చని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణమని వెల్లడించారు. స్క్రిప్ట్, యాక్టింగ్, డైరెక్షన్, సంగీతం, షార్ట్ ఫిలిమ్‌ల నిర్మాణం వంటి విభాగాలలో విద్యార్ధులు తమ ప్రతిభ ను చాటేందుకు సినీ వాల్యుషన్ కార్యక్రమం ఎంతో ఉప యోగపడుతుందని అన్నారు.

పరిశ్రమలోకి అనేకమంది కొత్తవారు వచ్చి తమ ప్రతిభ తో గుర్తింపును పొందుతున్న విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్ధులు కూడా ఇలాంటి వేదికల ద్వారా తమ ప్రతిభను చాటాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజి ప్రిన్సిపాల్ సుందర్ రెడ్డి, మర్రిరెడ్డి, లాస్య మధుకర్, సీల్వ, కురువిల్లా, సుశీల్‌రావు, కరుణా కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news