ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే వైసీపీని ఢీకొట్టనున్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది..కానీ ఈ సారి ఎన్నికల్లో అలాంటి పరిస్తితి రాకూడదు అని, రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది తర్వాత విషయం. కానీ టీడీపీ-జనసేన పొత్తు మాత్రం దాదాపు ఫిక్స్ అని చెప్పవచ్చు.
ఇక ఈ పొత్తు ఫిక్స్ అయితే..టీడీపీ..జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది..జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందనేది చర్చ నడుస్తున్నది. ఇంకా సీట్లపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇదే సమయంలో పొత్తు ఉంటే పవన్‌కు సీఎం పదవి ఇవ్వాలని జనసేన నేతల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కానీ పవన్ మాత్రం పరిస్తితు తెలుసు కాబట్టి…సీఎం సీటుపై పట్టుబట్టే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేన కంటే టీడీపీ బలమైన పార్టీ అనే విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు పడితే..జనసేన 6 శాతం వరకు పడ్డాయి. ఇక ఇప్పుడు జనసేన బలం పెరిగిన..గట్టిగా చూసుకుంటే 10 శాతం వరకు పెరిగి ఉంటుంది. ఈ 10 శాతంతో జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం. కాబట్టి సీఎం సీటుని పవన్ ఆశించే అవకాశం లేదు. కానీ కాపు సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మాత్రం వైసీపీని టీడీపీ-జనసేన కలిసి నిలువరించాలని చెప్పారు..అదే సమయంలో పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఈ డిమాండ్ అంత తేలిగ్గా నెరవేరడం జరిగే పని కాదు.