నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి తలసాని

-

గణతంత్ర దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని… ఆహ్లాదకరమైన వాతావరణమని తెలిపారు. మొక్కలను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు చేసిన వాళ్లమవుతామని చెప్పారు.

TS News: వాటిని గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ: తలసాని | telangana news talasani  srinivas yadav cm kcr chsh

హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని… ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోందని చెప్పారు. గ్రాండ్ నర్సరీని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రశంసించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో లభించే రకరకాల మొక్కలను ఒకే చోట లభించేలా గ్రాండ్ నర్సరీని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news