రాష్ట్రంలో 1363 గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న TSPSC.. తాజాగా సిలబస్ను విడుదల చేసింది. మొత్తం 3 పేపర్లు ఉండగా.. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉన్నాయి. 3 పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు TSPSC వెబ్సైట్లో పూర్తి సిలబస్ చూసుకోవచ్చు. ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఇటీవల… తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస్టులతో గ్రూప్ – 3 నోటిఫికేషన్ జారీ అయింది.
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే సిలబస్ లోని అంశాలు, పరీక్ష విధానానికి సంబంధించిన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవే గాకుండా తాజాగా… జోన్లవారీగా పోస్టుల వివరాలను కూడా ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.