నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్ ఉదాహరణ అని అన్నారుఎమ్మెల్సీ కవిత. ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? అని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ కేటాయించడం లేదని ఆరోపించారు.
పదిలక్షల ఆదాయం వరకు పనులు మినహాయింపు కలిగిస్తారని ఆశించామని, ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నామని, ప్రస్తుతం మంత్రి ప్రకటించిన రీబెట్ ఎవరికి ఉపయోగపడదని అన్నారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు లేదా బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఈ బడ్జెట్ లబ్ధి చేకూరేలా ఉందని ఆరోపించారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం 5300 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణకు రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు