డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్.. వైరల్ వీడియో

-

డ్యాన్స్.. ఈ కళ అందరికీ అబ్బదు. కొందరికే అబ్బుతుంది. అటువంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా.. డ్యాన్స్ అంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్లు, డ్యాన్స్ బాగా చేసేవాళ్లు తమకు సమయం దొరికినప్పుడైనా, డ్యాన్స్ చేయడానికి ఏదైనా ప్లాట్ ఫాం దొరికినా తమ డ్యాన్స్ స్కిల్స్ ను పదిమందికి చూపిస్తారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అటువంటి వ్యక్తికి సంబంధించినదే.

పేరు ప్రతాప్ చంద్ర ఖండ్వాల్, వయసు 33 ఏళ్లు. ఇది వరకు హోంగార్డుగా పనిచేసేవాడు. ఇటీవలే ట్రాఫిక్ పోలీస్ గా ప్రమోషన్ వచ్చింది. దీంతో మనోడిని ఒరిస్సాలోని భువనేశ్వర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ గా విధులు నిర్వర్తించడం ప్రారంభించాడు. కానీ.. సిగ్నల్స్ దగ్గర మనోడిని పట్టించుకున్న వాహనదారుడు లేడట. ఎవ్వరిని ఆగమన్నా.. అతడి ముఖం చూసి సిగ్నల్ దగ్గర ఆగకుండానే వెళ్లిపోతున్నారట.

దీంతో లాభం లేదనుకొని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డ్యాన్స్ వేయడం ప్రారంభించాడట. దీంతో మనోడి డ్యాన్స్ కు ఫిదా అయిన జనాలు అక్కడ ఆగడం ప్రారంభించారట. అరె.. ఇదేదో వర్కవుట్ అయ్యేట్టుందే అని ఇక.. రోజూ సిగ్నల్ దగ్గర డ్యాన్స్ చేయడం ప్రారంభించాడట. అప్పటి నుంచి ట్రాఫిక్ కంట్రోల్ ఉండటంతో పాటు మనోడి డ్యాన్స్ ను కూడా వాహనదారులు ఎంజాయ్ చేస్తున్నారట. దీంతో ఇక.. అదే డ్యాన్స్ ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా అంటూ చెబుతున్నాడు ప్రతాప్. వార్నీ.. నీ ఐడియా భలే ఉందిరా అబ్బాయ్.

ఈ వార్త చదువుతుంటే ఎవరో గుర్తొస్తున్నారా? అవును.. రంజీత్ సింగ్ అని ఓ ట్రాఫిక్ పోలీస్ మధ్య ప్రదేశ్ లో ఇలాగే సిగ్నల్స్ దగ్గర మైకెల్ జాక్సన్ స్టెప్స్, మూన్ వాక్ చేస్తూ వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు ఈ ప్రతాప్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news