పోస్ట్ ఆఫీస్ నుండి అదిరే స్కీమ్.. నెలకి ఎనిమిది వేలు..!

-

మనకి అందుబాటులో చాలా స్కీమ్స్ వున్నాయి. ఈ స్కీమ్స్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు. పోస్టాఫీస్‌ కూడా వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. నెల నెలా రాబడి కోరుకునే వాళ్ళు పోస్టాఫీస్‌ స్కీమ్స్ లో డబ్బులు పెట్టచ్చు.

పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ని పెంచింది. రూ.4.5 లక్షలగా ఉన్న లిమిట్‌ను రూ.9 లక్షలకు పెంచుతున్నట్లు కూడా కేంద్రం ప్రకటించింది. జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను వినియోగిస్తుంటారు. ఏ రిస్క్ లేకుండా నెల నెలా చేతికి డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లో చేరితే 7.1 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి నెలా ఈ డబ్బులు మీకు వస్తాయి. ఒకవేళ కనుక మీరు వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోక పోతే ఎలాంటి వడ్డీ రాదు. కనుక నెల నెలా వడ్డీ డబ్బులను ఖాతా నుంచి తీసుకోవడం మంచిది. 10 ఏళ్లకుపైగా వయసున్న వారు ఎవరైనా ఈ స్కీమ్‌ ని ఓపెన్ చెయ్యచ్చు. మీరు లక్ష పెడితే ప్రతి నెలా రూ.592 వస్తాయి. అదే రూ.2 లక్షలు పెడితే .1183 పొందొచ్చు. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2958 వస్తాయి. అదే మీరు ఈ స్కీమ్ లో రూ.15 లక్షలు కనుక పెడితే రూ.8875 నెల నెలా వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news