ఇంద్రకీలాద్రిపై 15మందితో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు

-

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. గత ఐదు రోజుల క్రితం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు కనకదుర్గ ఆలయ ఈవో భ్రమరాంబ ఈ నెల 8న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.

కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఉత్తర్వులు అమలు చేయనందుకు కోర్టుకు రావాలని ఆదేశించింది. రెగ్యులరైజేషన్ లో అన్యాయం జరిగిందని ఆలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news