తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి,తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు సినిమాలలో పైట్లకు పాటలకు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకొని బిగ్గర్ దెన్ బచ్చెన్ గా ఇండియాటుడే లో ప్రముఖుడుగా పేరు పొందారు. అలాగే దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమను నడిపించే పెద్ద దిక్కుగా వున్నారు.
రాజకీయాలలో వెళ్ళక ముందు వరకు తన సినీ జీవితం సూపర్ గా సాగింది. ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో అప్పటినుండి తన చరిష్మా కోల్పోవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తొందరగానే గ్రహించి మళ్లీ సినిమా రంగంలో అడుగుపెట్టారు. మళ్లీ ఖైదీ నంబర్ 150 తో తన సత్తా చాటాడు. ప్రస్తుతం చిరు వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ, ఇంకో రెండు సంవత్సరాల వరకు డోకా లేకుండా చూసుకున్నాడు.
ఇక తన రీసెంట్ సినిమా వాల్తేరు వీరయ్య 200 కోట్లు పైగా వసూళ్ళు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం చిరంజీవి మెహెర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. అలాగే అనేక మంది కొత్త మరియు పాత డైరెక్టర్స్ తో కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన జాబితాలో వెంకి కుడుములు, మారుతి, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు కూడా ఉన్నారు. ఇక వీరితో పాటు శ్రీకాంత్ అద్దాల తో కూడా సినిమా చేయడానికి ఒకే చెప్పారని అంటున్నారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల మెగాస్టార్ చిరంజీవికి ఫైనల్ కథ చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.