ఈ 4 స్కీమ్స్ తో అదిరే లాభాలు.. సీనియర్ సిటిజన్లకి నెలకు రూ.70 వేలు…!

-

చాలా మంది భవిష్యత్తు బాగుండాలని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. రిటైర్ అయ్యాక పొదుపు పథకాల ద్వారా భవిష్యత్తు లో ఏ సమస్యా లేకుండా ఉండచ్చు. సేవింగ్ స్కీమ్స్ ద్వారా గరిష్ఠంగా నెలకు రూ.70,500 సంపాదించచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. గరిష్ఠంగా రూ.1.10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్లకు మరింత రిలీఫ్ కలుగుతుంది. ఇక మరి ఏ స్కీమ్ బాగుంటుంది..?, ఆ స్కీమ్ వివరాలని ఇప్పుడే చూసేద్దాం. సీనియర్ సిటిజన్లకు ఆదాయ మార్గాలు కల్పించడానికి కేంద్రం పలు స్కీమ్స్ ని తెచ్చింది. నిర్దిష్ట మొత్తం లో పెట్టుబడి పెడితే రిటర్నుల రూపం లో సంపాదించొచ్చు. సీనియర్ సిటిజన్లకు వివిధ పొదుపు పథకాలు అందుబాటులో వున్నాయి. ఇక స్కీమ్ వివరాలని చూస్తే.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్, ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్స్ అందుబాటులో వున్నాయి.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌:

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు.
గరిష్ఠంగా పెట్టుబడులు పెడితే నెలకు సుమారుగా రూ.70,500 స్థిరమైన ఆదాయం వస్తుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్:

రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలు గరిష్ఠ పెట్టుబడిని పెంచారు.
ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.1శాతంగా ఉంది. నెలవారీగా వడ్డీని పొందవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్:

గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి దీనిలో పెట్టచ్చు.
రూ 15 లక్షల నుంచి రూ.30 లక్షలకు ఈ స్కీమ్ లిమిట్ ని పెంచారు.
భార్యా భర్తలు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.
గరిష్ఠంగా ఈ పథకంలో రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు.
ఈ స్కీమ్ గడువు 5 ఏళ్లు. రిటర్నుల రేటు 8 శాతంగా ఉంది. నెలకు రూ.70,500 సంపాదించచ్చు

ప్రధానమంత్రి వయ వందన యోజన:

గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రధానమంత్రి వయ వందన యోజన లో దంపతులు ఇద్దరిలీ రూ.30 లక్షలు అవుతుంది.
ఈ స్కీమ్ కింద 7.4 శాతం వడ్డీ వస్తోంది.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌:

మహిళలు, బాలికల కోసం దీన్ని తీసుకు వచ్చారు.
ఇందులో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పొదుపు చెయ్యచ్చు.
రెండేళ్ల పాటు గడువు ఉంటుంది.
7.5శాతం వడ్డీ మీకు ఈ స్కీమ్ కింద వస్తుంది.
ఈ నాలుగు స్కీమ్స్ లో డబ్బులు పెడితే రూ.1.10 కోట్ల వరకు సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news