రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది: అక్బరుద్దీన్

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే దివంగత మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి, జగపతిరావు , రుద్రమదేవి మృతి పట్ల సభ సంతాపం తెలియజేసింది. వారు చేసిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ ముందుకు తీసుకువచ్చారు. మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును మంత్రి నిరంజన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా అందించడం లేదని చెప్పారు. కేంద్రం చేసిన అప్పుల ముందు రాష్ట్రం అప్పులు చలచినవి అని అని వ్యక్తపరిచారు .

తెలంగాణ అప్పుల గురించి కేంద్రం వేలెత్తి చూపడం పెట్టడచాలా విచిత్రంగా ఉందన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చను ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ప్రారంభించారు. రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌ రావుకు అభినందనలు తెలియపరిచారు. పునర్‌ విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగ్గా అందడం లేదని వ్యక్తపరిచారు. కేంద్ర పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్‌కు 2/3వ వంతు, తెలంగాణకు 1/3 వంతు మాత్రమే ఇస్తున్నదని మండిపడ్డారు . కొందరు మతంపేరుతో విషం నింపడం కంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని వెల్లడించారు అక్బర్ ఉద్ద్దీన్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news