మోడీ స్పీచ్… బీఆర్ఎస్ వాకౌట్

-

లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని బీఆర్ఎస్ బైకాట్ చేసింది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లోక్‌స‌భ‌లో స‌మాధానం ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగాన్ని బాయ్‌కాట్‌ చేస్తూ బీఆర్ఎస్(భార‌త్ రాష్ట్ర స‌మితి) ఎంపీలు లోక్‌స‌భ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్య‌వ‌హారంపై జేపీసీ వేయాల‌ని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. త‌మ డిమాండ్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డంతో స‌భ నుంచి వెళ్లిపోతున్న‌ట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు వ్యక్తపరిచారు. అనంత‌రం బీఆర్ఎస్ ఎంపీలు స‌భ నుంచి బయటకు వెళ్లిపోయారు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీలు సురేశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, బీబీ పాటిల్ సహా ఇతర ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news