బిజెపిలోకి ఆదినారాయ‌ణ‌రెడ్డి.. జంపింగ్ వెన‌క స్టోరీ ఇదేనా..!

-

కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం రాత్రి ఆయన బిజెపిలో చేరేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం ఆయన బిజెపి జాతీయ నేత అమిత్ షా స‌మ‌క్షంలో పార్టీ జెండా క‌ప్పుకుంటారని సమాచారం. వాస్తవానికి ఆదినారాయణ పార్టీ మార్పుపై అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్ప‌టి నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక వైసీపీ నుంచి గెలిచిన ఆయ‌న చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో పసుపు కండువా కప్పుకున్నారు.

ఆదినారాయణ రెడ్డి కి చంద్రబాబు మంత్రి పదవి బహుమతిగా ఇచ్చారు. ఇక చంద్రబాబు కోసం చాలాసార్లు రాజీపడిన ఆదినారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో త‌న కంచుకోట అయిన జ‌మ్మ‌ల‌మ‌డుగు వ‌దిలేసి క‌డ‌ప ఎంపీగా ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన ఆదినారాయణ టిడిపిలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడతారనే వార్తలు జోరుగా వినిపించాయి. చివరకు చంద్రబాబు పిలిపించుకుని ఆదినారాయణను ఎంత బుజ్జ‌గించినా ఆయన వినలేదని తెలుస్తోంది.

ఇక ఇప్పటికి ఇప్పుడు ఆయన బిజెపిలోకి వెళ్లాల్సిన అవసరం ఉందా ? అంటే కడప జిల్లా రాజకీయ వర్గాల ప్రకారం అవుననే అంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్దతు లేకపోతే ఆయన వ్యాపారాలు నడిచే పరిస్థితి లేదట. ఈ క్రమంలో ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆది వాటి నుంచి బయటపడాలంటే ఏదో ఒక అధికార పార్టీలో చేరక‌ తప్పని పరిస్థితి. వైసిపి ఆదినారాయణ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. చంద్రబాబు కొన్నాళ్లు వేచి ఉండాలని చంద్రబాబు చెప్పినా అది మాత్రం అందుకు ఒప్పుకోక పోవడంతో చివరకు ఆయన పార్టీ వీడ‌క తప్పడం లేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news