శరీరంలో ముఖ్యమైన అవయవం హృదయం. దీన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే దీని రక్షణకు మనం ఆచరించాల్సిన విషయాలను తెలుసుకుందాం. ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్, టమాట, చేపలు, ఆలివ్ ఆయిల్, పండ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు. ప్రాసెస్డ్ ప్యాకింగ్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. ఇవి శరీరంలో వేడిని పెంచి గుండె మంటకు దారితీస్తుంది. అమెరికా చేసిన సర్వే రిపోర్టు ప్రకారం చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే దాదాపు 46 శాతం మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. వీరి గుండెపోటుకు గురయ్యే 28 శాతం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
సాధారణంగా మన శరీరానికి వేడిని పెంచే పదార్థాలను పరిమిత స్థాయిలో తీసుకోవాలి. మల్టీ విటమిన్స్, ఆస్పిరిన్ వంటి యాంటీ ఇన్ఫర్మేటరీ డ్రగ్స్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, కేన్సర్, డిప్రెషన్ వంటి రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని ప్రముఖ్య యూనివర్సిటీ వైద్యుడు డాక్టర్ రామన్ ఎస్ట్రచ్ తెలిపారు.
అసలు శరీరంలో కొన్ని రకాల ఆహారాలు వేడిని ఎందుకు పెంచుతాయన్నదానిపై కచ్చితమైన సమాధానం ఇంకా దొరకలేదు. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు తోడు… కాలుష్యం, ధూమపానం, రేడియేషన్, వంటి అంశాలు… శరీరంలో వేడి పెరిగేందుకు కారణం అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు…
మన శరీరంలో వేడి పెరిగితే ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఇవి సరైన ఎలక్ట్రాన్స్ కావు. ఇవి కణాలను నాశనం చేస్తాయి. తద్వారా రకరకాల వ్యాధులు వచ్చేలా చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది పిజ్జాలు, బర్గర్లు, రెడీ టూ ఈట్, టేక్ ఎవే వంటి ఆహారాలు, కూల్ డ్రింగ్స్, జ్యూస్ డ్రింక్స్, ఫ్యాట్ తో కూడిన స్నాక్స్ వంటివి ఎక్కువగా తింటున్నారు. ఫలితంగా బాడీలో వేడి పెరిగిపోతోందని డాక్టర్లు తెలిపారు. వీటివల్ల శరీరంలో వేడి పెరిగిపోతుంది. మన శరీరానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పులు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.