ఆసీస్‌తో టెస్టు, వన్డేలకు జట్టును ప్రకటించిన బీసీసీఐ

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడిన తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడింది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలోనే చివరి రెండు టెస్టులకు కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. దీంతోపాటు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికె), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ లతో కూడిన టెస్ట్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడో టెస్టు ఇండోర్ లో మార్చి 1 నుంచి 5 వరకు జరగనుండగా, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13వరకు ఆహ్మదాబాద్ లో జరగనుంది.

ఆస్ట్రేలియా జట్టుతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు కూడా టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. సొంత పనుల నేపథ్యంలో ఫస్ట్ వన్డేకు రోహిత్ శర్మ దూరం కానుండగా పాండ్య టీమ్ ను లీడ్ చేయనున్నారు. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news