మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన చాలా ఉపయోగాలు వున్నాయి. ఆదాయపు పన్ను శాఖకు ఆన్‌లైన్ లేదా, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని 10 అంకెల సంఖ్య గల పర్మనెంట్ అకౌంట్ నంబర్ ని పొందొచ్చు. ఒకవేళ కనుక పాన్ కార్డ్ పోతే ఏమిటి…? ఏ విధంగా మీరు తిరిగి మీ పాన్ కార్డు ని పొందాలి…? ఆ విషయాన్నే ఇప్ప్పుడు చూద్దాం.
మీరు ఈజీగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రీ అప్లై చేసి కార్డు ని పొందొచ్చు. దీని కోసం మొదట మీరు
కొన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందు మీరు కార్డు పోయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. దీని ద్వారా మీ పాన్ కార్డును మరొకరు తప్పుగా ఉపయోగించే ఛాన్స్ ఉండదు. కనుక మొదట ఇలా చెయ్యండి.
ఆన్ లైన్ లో పాన్ కార్డు ని ఇలా పొందండి:
మొదట TIN-NSDL అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
అప్లికేషన్ విధానాన్ని సెలెక్ట్ చేసి ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులో మార్పులు, తప్పులను అప్డేట్ చేయడం లేదా రీప్రింట్ పాన్ కార్డ్ వంటివి కనపడతాయి. ఆ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
వివరాలని ఇచ్చేయండి. తరవాత టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. అప్లికెంట్ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి కూడా వస్తుంది ఇది.
మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసాక అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ విధానాలను ఎంచుకోండి.
మీరు నేరుగా వెళ్లి డాక్యుమెంట్లను ఇవ్వచ్చు, ఈ-కేవైసీ ద్వారా డిజిటల్‌గా డాక్యుమెంట్లు ఇవ్వచ్చు లేదా ఇ-సైనింగ్ ద్వారా అయినా సరే ఇచ్చేయచ్చు.
ఇలా మీరు ఏదో ఓ ప్రక్రియ లో మీరు సబ్మిట్ చెయ్యచ్చు. 15-20 వర్కింగ్ డేస్‌లో మీకు కొత్త పాన్ కార్డ్ వస్తుంది.
ఆఫ్‌లైన్ పద్ధతిలో ఇలా అప్లై చెయ్యండి:
పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసేయాలి.
పూర్తి వివరాలను నమోదు చేసి సంతకాలు చేయాలి.
అలానే రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలపై క్రాస్ సైన్ చేయాలి.
ఎన్ఎస్‌డీఎల్‌కి అప్లికేషన్ ఫామ్, పేమెంట్, ఐడీ ప్రూఫ్ వంటివి పంపాలి.
పేమెంట్ చేసిన తర్వాత మీకో ధ్రువీకరణ పత్రం వస్తుంది.
రెండు వారాల్లో మీకు డూప్లికేట్ పాన్ కార్డు వస్తుంది.