పాలకుల నుంచి ప్రజలను రక్షించడానికి మన రాష్ట్రంలోనూ ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారేమోనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే గారికి 9 నుంచి 10 స్టెంట్లు వేయడం వల్ల మరియు తన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఎవరినీ పెద్దగా కలిసేవారు కాదని తెలిసిందన్నారు.
అయితే ఏ కారణం లేకుండా ఎవ్వర్నీ కలవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిపై కూడా ఉద్దవ్ థాక్రే గఈపై జరిగినట్లుగా తిరుగుబాటు తప్పదేమోనన్న అనుమాన్ని వ్యక్తం చేశారు. ఉద్దవ్ థాక్రే గారు మంచి పాలనాధక్షుడని అయినా వారి ఎమ్మెల్యేలను కలవకపోవడం వల్లే ఆయనపై ఏక్ నాథ్ షిండే గారి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారన్నారు. ఏక్ నాథ్ షిండే గారి తిరుగుబాటు అనంతరం, తనకు తానే జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విషయం తెలిసిందేనని అన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగడానికి ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవడంతో ఇక చేసేది ఏమి లేక తన ప్రతిపాదనను విరమించుకున్నారని తెలిపారు. పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉండబోరని తాను చెప్పలేనన్న రఘురామకృష్ణ రాజు గారు తాను మాత్రం ఏకనాథ్ షిండే తరహాలో వ్యవహరించబోనని చెప్పారు.