సంగారెడ్డిలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 75 ఏళ్లు అయిన బీసీలకు ఏ రంగంలో కూడా అవకాశాలు ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలపై వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు ఆర్.కృష్ణయ్య. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం బీసీ కులాలను అణచి పెడుతుందన్నారు.
బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే కేంద్ర మంత్రులను తెలంగాణలో తిరగనియ్యం అని హెచ్చరించారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం మెజార్టీ ప్రజలను బిచ్చగాల్లను చేశారని అబ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఏం మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారాన్ని సాధించుకోవాలన్నారు. బీసీలు అధికారాన్ని చేపట్టడానికి సమయం ఆసన్నమైంది అన్నారు. దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు రాజ్యాంగ హక్కులు కాలరాయబడ్డాయని విమర్శించారు.