పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి

-

‘అందాల రాక్షసి’ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటి లావణ్య త్రిపాఠి. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పులి మేక’ అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించారు. ఈ షో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. పెళ్లి వార్తలపై లావణ్య స్పందించారు. ‘‘ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. నేను అదృష్టవంతురాలిని. నా తల్లిదండ్రులు కూడా నా పెళ్లి గురుంచి నన్ను బలవంతం చేయడం లేదు. నేను టాలీవుడ్‌లో పదేళ్లుగా సినిమాలు చేస్తున్నాను. అందువల్ల నేను వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలని అందరు అనుకుంటున్నారు.

అసలు పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదని తెలిపింది. తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని, పెళ్లికి సంబంధించిన కలలు తనకు లేవని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే అని తెలిపింది. పెళ్లి మీద తనకు నమ్మకం ఉందని… నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పింది. వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news