విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాక్..

-

సుప్రీంకోర్టు విజయ్ మాల్యాకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలన్న పిటీషన్ కు కౌంటర్ గా.. విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పరిగణిస్తూ.. తన ఆస్తులను వేలం వేయటాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు విజయ్ మాల్యా. దీనిపై విచారణ చేసిన సుప్రీమ్ కోర్టు.. విజయ్ దాఖలు చేసిన పిటీషన్ ను కూడా కొట్టివేసింది. ప్రభుత్వం, ఆర్థిక సంస్థలను చర్యలను సమర్థించింది కోర్టు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా విదేశాలకు వెళ్లటాన్ని ఏమంటారంటూ మాల్యా తరపు న్యాయవాదులను సవాలు చేసింది న్యాయస్థానం.

తన క్లయింట్స్ తో సన్నిహితంగా లేకపోవటం, వారి నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు స్వీకరించకపోవటం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారని.. చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తామని.. ఆస్తుల వేలం నిలిపివేయాలని కోర్టుకు విన్నపించుకున్నారు మాల్యా తరపు న్యాయవాది. కానీ కోర్టు అందుకు సమ్మతించలేదు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు అభిప్రాయంతో ఏకీభిస్తూ.. విజయ్ మాల్యా పిటీషన్ ను కొట్టివేసింది సుప్రీమ్ కోర్టు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news