‘నువ్వు మా బాస్‌ పక్కలో పడుకో.. నాకు ప్రమోషన్‌ వస్తుంది’.. భార్యకు భర్త వేధింపులు

-

రోజు రోజుకు బంధాలకు విలువలేకుండా పోతోంది. చిన్న చిన్న సుఖాల కోసం ఎంతో విలువైన బంధాలను తాకట్టుపెడుతున్నారు. పుణేలో అమిత్ చాబ్రా అనే వ్యక్తి సభ్య సమాజం అసహ్యించుకునేలా వ్యవహరించాడు. తాను పనిచేస్తున్న సంస్థలో ప్రమోషన్ కోసం అత్యంత నీచానికి దిగజారాడు. తన బాస్ వద్ద ఒకరాత్రి గడపాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడు. బాస్ వద్దకు వెళితే తనకు ప్రమోషన్ తో పాటు ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయని అమిత్ చాబ్రా భార్యను బలవంతం చేశాడు. దాంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.

 

బాస్ కు పడక సుఖం అందించాలంటూ భర్త తనను ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. అంతేకాదు, తన మరిది రాజ్ కూడా తన పట్ల పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు 12 ఏళ్ల కుమార్తె ఉందని ఆమె వెల్లడించింది. కుమార్తె ఎదుటే రాజ్ వేధింపులకు పాల్పడ్డాడని వివరించింది. తాను ఎదురుతిరిగితే తీవ్రంగా కొట్టారని తెలిపింది.

 

గతేడాది ఇండోర్ లోని పుట్టింటికి వెళ్లిపోయానని, పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం, తనను కొట్టనని భర్త లిఖితపూర్వక హామీ ఇచ్చాడని మహిళ వెల్లడించింది. దాంతో మళ్లీ కాపురానికి వెళ్లానని, కానీ మళ్లీ వేధింపులకు దిగారని ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త అమిత్ చాబ్రా, మరిది రాజ్, అత్త, మామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news