Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్..అరివీర భయంకరంగా రవితేజ హీరో రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్ లో పెట్టారు ఈ మాస్ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో అరివీర భయంకరంగా రవితేజ ఉన్నారు. సీత ను తీసుకెళ్లాలంటే.. ఈ రావణాసురున్ని దాటి వెళ్లాలంటూ రవితేజ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై హైప్ తెచ్చింది.