ఏపీలో జనసేన బలం ఇంకా పెరగాల్సి ఉంది..ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఏ మాత్రం బలం లేదని తేలిపోతుంది. అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ సైతం పెద్దగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. దీని వల్ల జనసేన అన్నీ జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో బలోపేతం కావడం లేదు. తాజాగా వచ్చిన సర్వేలో జనసేన కేవలం రెండు జిల్లాల్లోనే ప్రభావితం చూపుతుందని తేలింది. తాజాగా ఆత్మసాక్షి సర్వేలో జనసేనకు 11 శాతం ఓట్లు, 7 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది.
ఆ 7 సీట్లు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరిలో 4, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 3 సీట్లు వస్తాయని తేలింది. మిగిలిన జిల్లాల్లో ఒక్క సీటు కూడా జనసేనకు రావడం లేదు. కాకపోతే విశాఖ, కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో జనసేన ఎక్కువ ఓట్లు చీలుస్తుంది..దాని వల్ల టిడిపికి నష్టం..జనసేనకు లాభం జరుగుతుంది. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జనసేన బలం పెరగడం అనేది చాలా కష్టమైన పని.
కాకపోతే రెండు జిల్లాల్లో ప్రభావం చూపే జనసేన..విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. అయితే టిడిపితో గాని పొత్తు ఉంటే జనసేన ఎక్కువగానే సీట్లు సాధించుకుంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.
ప్రస్తుతానికి మాత్రం పొత్తు విషయంలో క్లారిటీ రావడం లేదు. తాజాగా వచ్చిన సర్వే కూడా ఎవరికి వారు సింగిల్ గా పోటీ చేస్తేనే వచ్చే ఫలితాలు. అంటే సింగిల్ గా జనసేన ఇంకా బలపడాలి. ఇతర జిల్లాల్లో బలమైన నాయకులని జనసేనలోకి చేర్చుకోవాలి..అప్పుడే పార్టీ బలపడే ఛాన్స్ ఉంది. లేదంటే ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది.