వేణుకి కమెడియన్ గా మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే వేణు ‘జబర్దస్త్’ లో టీమ్ లీడర్ గా ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ అనే సినిమా మంచి ఫలితం సాధించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కేటాయించవలసి వచ్చింది. అన్ని వైపుల నుంచి ఎమోషన్స్ పండేలా చూసుకున్నాము అన్నారు వేణు. ఈ సినిమాను నేను ఇంత బాగా తీయడానికి కారణం, నేను పనిచేసిన దర్శకుల దగ్గర నుంచి సంపాదించుకున్న అనుభవమే .. నేర్చుకున్న విషయాలే. కొత్త ఆర్టిస్టుల దగ్గర నుంచి నటన ఎలా రాబట్టుకోవాలనేది తేజ గారిని చూసి నేర్చుకున్నాను.
ఇక ఒక సీన్ ను ఆర్టిస్టులకు ఎలా వివరించాలనేది కృష్ణవంశీ గారిని చూసి తెలుసుకున్నానని తెలిపారు. వేణు ఇక త్రివిక్రమ్ గారు రెండు పేజీలకు అవసరమయ్యే సీన్ ను ఒక్క డైలాగ్ లో చెప్పగలరు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నేను ఒక చిన్న సీన్ చేశాను. అయినా కూడా ఆయన నాకు కథ మొత్తం వివరంగా చెప్పారు. ఆయన నుంచి ఇలా ఎన్నో నేర్చుకున్నట్లు వేణు తెలిపారు. అందువల్లనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగానని చెప్పుకొచ్చారు.