శరరీంలో రక్తం తక్కువగా ఉంది అంటే.. రోగాలకు ఆహ్వానం పలుకుతున్నట్లే.. అవును.. ఒంట్లో రక్తం ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటే.. కొందరు ఏమీ కాదులే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. రక్తం తగ్గితే దీర్ఘకాలంలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రక్తం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక మహిళలు, చిన్నారులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, సర్జరీలు అయిన వారు శరీరంలో రక్తం ఎక్కువగా ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకు గాను డాక్టర్లు సూచించే మందులను వాడడంతోపాటు కింద తెలిపిన పలు ఆహారాలను నిత్యం తీసుకుంటే.. దాంతో శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. దానిమ్మపండ్లు
దానిమ్మ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఇతర విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ రక్తాన్ని పెంచుతాయి. నిత్యం దానిమ్మ పండ్లను తినడం ద్వారా లేదా ఆ పండు జ్యూస్‌ను తాగడం వల్ల రక్తాన్ని పెంచుకోవచ్చు.
2. బాదం, జీడిపప్పు
వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు వీటిలో ఉంటాయి. నిత్యం గుప్పెడు బాదం పప్పు లేదా జీడిపప్పును తీసుకుంటే శరీరంలో ఐరన్ పెరిగి రక్తం ఎక్కువగా తయారవుతుంది. వీటిని సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తీసుకున్నా చాలు.. రక్తం బాగా తయారవుతుంది.
3. బెల్లం
చాలా మంది బెల్లాన్ని చిన్నచూపు చూస్తారు. కానీ ఇందులో ఐరన్‌తోపాటు పలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. జలుబు తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది. తరచూ బెల్లంను తిన్నా.. లేదా నిత్యం భోజనం చేశాక ఒక బెల్లం ముక్కను నమిలి మింగినా.. ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తహీనత లేకుండా ఉంటుంది.
4. పాలకూర
పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని అనుకుంటారు. కానీ దీన్ని నిత్యం తినాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు తిన్నా చాలు. దీంతో అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీంతో శరీరంలో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
5. ఎరుపు రంగులో ఉండేవి
ఎరుపు రంగులో ఉండే టమాటాలు, క్యారెట్లు, యాపిల్స్‌తోపాటు బీట్‌రూట్ వంటి కూరగాయలను నిత్యం తీసుకున్నా శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. తద్వారా దీర్ఘకాలికంగా కూడా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.