బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి – రెడ్కో చైర్మన్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళ అనే గౌరవం లేకుండా బండి సంజయ్ మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉందన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి, బిజెపి పార్టీకి ఉన్న గౌరవం, మర్యాద ఎంటో తెలియజేస్తున్నదన్నారు. కవితను అవమానించిన బండి సంజయ్ ని అరెస్ట్ చేసిచట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. “మహిళల హక్కుల కోసం పోరాడుతున్న కవిత గారిపై బిజెపి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నది. కేంద్రంలోని మోడీ సర్కారు దురుద్దేశపూర్వకంగా మహిళాబిల్లును తొక్కిపెట్టింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అడిగినందుకు కేసులతో వేధిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కానీ అవగాహన లేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు.

బిజెపి అధినాయకత్వం కుట్ర పూరితంగా కవితపై కేసు పెట్టినా పారిపోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బిజెపి బ్రోకర్లు, వారి వెనకాల ఉన్న బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కానీ కవిత మాత్రం ఏ తప్పు చేయకున్నా.. ధీరవనితలు రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో పోరాడుతున్నారు. అలాంటి వీర వనిత గురించి నీచంగా మాట్లాడిన బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి” అని డిమాండ్ చేశారు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news