తెలంగాణ మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? – వైఎస్ షర్మిల

-

తెలంగాణ మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? అని వైఎస్ షర్మిల ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా? మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించడం సంతోషమన్నారు. అదే మేము మీకు వందల సార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించలేదు… మీలో చలనం ఎందుకు రాలేదు? అని నిలదీశారు.


నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా? మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలు అంటే మీకు కనపడలేదు.. కేటీఆర్ వ్రతాలు చేసుకోండి అని అవమానిస్తే మీకు కనపడలేదని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే అనుచరులు మా మీద దాడి చేస్తే మీకు కనపడలేదు.. మహిళలను కించపర్చుతూ మాట్లాడుతున్న అధికార పార్టీ మాటలు మీకు వినబడవు, కనపడవు.. వారి ఆకృత్యాలు కనపడవు.. వారు చేసే అత్యాచారాలు కనపడవని విమర్శలు చేశారు. కానీ ముఖ్యమంత్రి బిడ్డ మీద చీమ వాలే సరికి మీకు బాధ్యత గుర్తుకువస్తుంది.. ఎందుకంటే మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ కాదన్నారు. మీది BRS పార్టీ కోసం పనిచేసే కమిషన్ .. BRS కమిషన్ .. BRS పార్టీలోని మహిళల కోసం మాత్రమే పనిచేసే కమిషన్ అంటూ రెచ్చిపోయారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news