ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు హెచ్చరింపులు చేపట్టారు. మంత్రుల పని తీరును తాను గమనిస్తున్నానని సీఎం జగన్ వెల్లడించారు. తేడా వస్తే మంత్రులను మారుస్తానంటూ ఆయన తెలిపారు. జులైలో వైజాగ్ వెళ్తామంటూ జగన్ మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కచ్చితంగా గెలవాలని మంత్రులకు జగన్ మంత్రులతొ అన్నారు. కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. జూలై నెల నుంచి ప్రభుత్వ పాలన వైజాగ్ నుంచి జరుగుతోందని అన్నారు సీఎం జగన్. విశాఖపట్నం వెళ్లేందుకు దాదాపు ముహూర్తం కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సీఎం జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు, బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు చేపడుహతున్నారు. కల్తీమద్యం తయారీ, విక్రయదారులు, ఎర్రచందనం స్మగ్లర్లను వైసీపీ తరఫున పెద్దల సభకు పంపాలని చూస్తున్నారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ తప్పుడు విధానాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అక్రమ వ్యవహారాలపై ఈసీ చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు వారు.