పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంపాదించిన డబ్బుతోనే దెబ్బతీశారని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. మీడియాతో మాట్లాడుతూ, ‘‘సీఎం కేజ్రీవాల్ పాత్ర కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉంది. ఈ లిక్కర్ స్కామ్‌లో కవిత నేను పెద్ద సముద్రంలో చిన్న చేపను అన్నారు. అది నిజమే. చిన్న చేపే పెద్ద గేమ్ ఆడింది. లిక్కర్ కుంభకోణంలో బీఆర్‌ఎస్, వైసీపీ, ఆప్ కలిసి అవినీతికి పాల్పడ్డాయి. ఎక్సైజ్ మంత్రి సిసోడియా నే కాదు ఇంకా పెద్దల పాత్ర కూడ ఉంది. ఈ కేసులో పాలసీని ఆమోదం తెలిపిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను ఎందుకు ఇందులో పాత్రదారును చేయలేదు అని ప్రశ్నించారు.
అలాగే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎందుకు బాధ్యులను చేయలేదు. అసలు దోషులను పక్కన పెట్టి కొంతమంది దోషులను మాత్రమే అరెస్టులు చేసి విచారణ చేస్తున్నారు. గోవా, పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ లిక్కర్ డబ్బును పంచిపెట్టింది. ఆప్ అక్కడ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ కు నష్టం వాటిల్లింది. లిక్కర్ స్కామ్, లిక్కర్ ఫైల్స్ అన్ని బీజేపీ కనుసన్నుల్లోనే నడుస్తున్నాయి. బీజేపీ , ఆప్, బీఆర్‌ఎస్ , వైసీపీ కలిసి ఈ పని చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికి ఇప్పుడు బీఆర్ఎస్, ఆప్ పని చేస్తున్నాయి. మద్యంతో దేశాన్ని నింపి కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారు. అదానీ ఇష్యూ పక్కన పెట్టడానికే లిక్కర్ స్కామ్‌ను హైలెట్ చేస్తున్నారు.’’ అని తన ఆగ్రహం అద్దంకి దయాకర్.