ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ 37 ఏళ్ల తర్వాత తాను సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాలని సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే. కాగా 1985 జూలైలో సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు రాంగోపాల్ వర్మ.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాంగోపాల్ వర్మకు ఈ సర్టిఫికెట్ను అందజేశారు. కాగా విజయవాడలో ఉన్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న రాంగోపాల్ వర్మ దాదాపు 37 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ నుంచి తన సర్టిఫికెట్ను తీసుకున్నారు అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా.. ‘నేను పాసైన 37 ఏళ్ల తరవాత బీటెక్ డిగ్రీని పొందడం చాలా సంతోషంగా ఉంది. సివిల్ ఇంజినీరింగ్లో కొనసాగడం ఇష్టం లేక 1985తో నేను ఈ సర్టిఫికెట్ తీసుకోలేదు. థాంక్యూ ఆచార్య నాగార్జున యూనిర్సిటీ.. ‘ అంటూ రాస్కొచ్చారు చాలామంది స్పందిస్తూ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఏఆర్ రెహమాన్ సైతం కాంగ్రెస్లేషన్స్ రాము గారు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈట్వీట్ కు రిప్లై ఇస్తూ థాంక్యూ సార్ అంటూ వర్మ స్పందించడం జరిగింది.
Sirrrrrrrrr thyaaaaaanksssss😌😌😌 https://t.co/z2YOJ750Hg
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2023
కాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. దావూద్, రంగీలా వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అప్పట్లో రంగీలా సినిమా ఎంతటి సంతోషం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.