అమృత్​పాల్ సింగ్ కోసం పోలీసుల వేట.. పంజాబ్ లో టెన్షన్ టెన్షన్

-

ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం పోలీసు నిఘాలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్​ పంజాబ్​ దే’ అధినేత అమృత్​పాల్ సింగ్ కోసం పంజాబ్​ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అమృత్‌పాల్ స్వస్థలమైన అమృత్‌సర్​లోని జల్లుపుర్‌ ఖేరాలో అతడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు.. ఆ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు సేవలు నిలిపివేత ఉండగా.. దాన్ని సోమవారం మధ్యాహ్నం వరకు పొడగించింది. బ్యాంకింగ్, వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు బ్రాడ్​బ్యాండ్ సేవలను నిలిపివేయడం లేదని పేర్కొంది.

‘ప్రస్తుతం యావత్​ పంజాబ్ రాష్ట్రం.. పోలీసు పహారాలో ఉంది. ‘అమృతపాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తాం. అమృత్​పాల్​కు చెందిన రెండు వాహనాలను సీజ్ చేశాం. అలాగే భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం’ అని జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ సిన్హా చాహల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news