Telangana : 500మందితో బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టదలిచింది. 500 మందితో ఈ ధర్నా జరగనుంది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఆ పార్టీకి అనుకూలంగా తీర్పునిస్తూ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఐటీ శాఖ వైఫల్యంతోనే ఈ ఘటన చోటుచేసుకోవడం వల్ల ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆ పదవికి రాజీనామా చేయాలని కోరింది. మరోవైపు లీకేజీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఇద్దరిని ప్రధాన నిందితులుగా గుర్తించిన పోలీసులు 19 మందిని సాక్షులుగా చేర్చారు. ఓవైపు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో బీజేపీ నిరసనలకు పిలుపునివ్వడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news