కేటీఆర్.. నిన్ను వెధవ అనాలా, బ్రోకర్ అనాలా? కానీ నేను అనను – రఘునందన్ రావు

-

సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. కెసిఆర్ ను బండి సంజయ్ బ్రోకర్ అన్నారని.. నేను ప్రధాని మోదీని బ్రోకర్ అనలేనా? లోఫర్, లుచ్చా అనే మాటలు చదవలేనా? కానీ నాకు సంస్కారం ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. అయితే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. మోడీ వయసు ఎంత? మీ వయసు ఎంత కేటీఆర్? అని ప్రశ్నించారు.

సభ్యత సంస్కారాలతో మాట్లాడాలని సూచించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని.. ప్రధాని కుర్చీకి కూడా గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేటీఆర్ నోరుని ఫినాయిల్ తో కడిగేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వేములవాడ రాజన్న సరైన సమయంలోనే మీకు బుద్ధి చెబుతాడని హెచ్చరించారు రఘునందన్ రావు. మీ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టామని చెబితే బాగుండేది అన్నారు. ఇక ప్రభుత్వ భూమి అని కోర్టు ఆర్డర్ ఇచ్చాక సర్వే నెంబర్ 77 లో 8 ఎకరాల భూమిలో మునిసిపల్ మంత్రిగా అనుమతి ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ఏమనాలి కేటీఆర్ నిన్ను.. చట్టం తెలవని వెధవ అనాలా? బ్రోకర్ అనాలా? కానీ నేను అలా అనను అంటూ కౌంటర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news