నత్తలను చాలా మంది చూసే ఉంటారు.. అదేంటో ఇవి చూసేందుకు కూడా చాలా అగ్లీగా కనిపిస్తాయి.. అది స్లోగా పాకుతూ పోతుంది. దాని వెనకే ఏదో కారుతుంది.. ఛీ అనిపిస్తుంది వాటిని చూస్తే చాలా మందికి.. కానీ మీకు తెలుసా.. నత్తలు ఎంత మంచివో.. వాటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంట. ఏంటీ నత్తను తినడమా.. బుర్రుండే మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా..? నిజమేనండి.. వీటిని తినడం ద్వారా దగ్గు, ఆయాసం వంటి జబ్బులకు దూరంగా ఉండచ్చునని చెబుతున్నారు గోదావరి వాసులు. నత్తలు కూడా ఆహారంలో భాగంగానే తీసుకోవచ్చంట. నత్తలు కూడా రోగాలను నయం చేస్తున్నాయని అంటున్నారు ఈ గోదారోళ్లు..
ఇటీవల గోదావరి జిల్లాలో వాసులు ఎక్కువగా నత్తలను ఆహారంగా తీసుకుంటున్నారు. గోదావరి మంచినీటి జలాల్లో పెరిగే ఈ నత్తాలు కేవలం నాచు చిన్న చిన్న కీటకాలు తిని బతుకుతాయి. ప్రస్తుతం వీటిని గోదావరి కాలువ గట్టు పక్కన ఎక్కువగా విక్రయిస్తున్నారు. శనగపప్పు కలిపి నత్తల కర్రీ చేస్తే..ఆహా..రుచి మాములుగా ఉండదట.. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమట.. నత్తలు తినడం ద్వారా ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస కోస వ్యాధులతో పాటు, మూలవ్యాధులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా లభిస్తాయని ఈ సీజన్లో వచ్చే దాదాపు అన్ని వ్యాధులకు నత్తలు చాలా ఉపయోగకరమని చెబుతున్నారు.
ధర తక్కువే..
వీటి ధర కేజీ 100 నుండి 200 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగ ఉండడంతో పెద్ద ఎత్తున మాంస ప్రియులు ఎగబడుతున్నారు. అయితే ఇవి తక్కువ మొత్తంలో దొరకడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది..వీటిని మొదట ఉప్పు పసుపుతో కడగాలట. ఆ తర్వాత మజ్జిగ వేసి శుభ్రం చేస్తే నత్తల ద్వారా వచ్చే వాసన పోయి ఆ తర్వాత వేడి నీటిలో ఉడికించి మసాలాతో వండడం ద్వారా మేక మాంసం కంటే రుచిగా ఉంటుందని నత్తల కర్రీ తిన్నవారు అంటున్నారు.. ఆంధ్రాలో ఆస్తామా, కీళ్లనొప్పులు, గ్యాస్ సమస్యకు గాడిద మాంసం కూడా తింటున్నారు. దీనివల్ల కూడా ఈ రోగాలు అన్నీ నయం అవుతున్నాయట.. వేలకు వేలు ఆసుపత్రుల్లో పెట్టే బదులు..ఇలాంటివి తిని అటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. రోగాలను నయం చేసుకోవచ్చు అని జనాలు బాగా నమ్ముతున్నారు.