సిట్ బృందం, గ్రూప్-1 తో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నేపధ్యం లో పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేపట్టారు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్. కుదిరితే ఛైర్మన్‌తో పాటు మిగతా వారికి కూడా నోటీసులు చేపట్టాలని సిట్ బృందం భావిస్తున్నట్లు సమాచారం.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, ఏఈ పోటీ పరీక్ష ప్రశ్నా పత్రాలతో పాటు మరో నాలుగు పరీక్ష పత్రాలు కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితులు కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి. వీరిద్దరిని విచారించడంతో మాజీ ఉద్యోగి ప్రవీణ్, అందులో పనిచేసే రమేష్, షమీమ్‌లకు కూడా గ్రూప్-1 పేపర్ అందించినట్లు .తెలియపరిచారు.
కార్యదర్శి పీఏగా ప్రవీణ్, కమిషన్ సభ్యుడు బండి లింగారెడ్డికి పీఏగా రమేశ్ పని చేశారు. దీంతో ముందుగా కార్యదర్శి, కమిషన్ సభ్యుడికి నోటీసులు జారీ చేశారు. వీరి వద్ద నుంచి ఆయా నిందితులకు సంబంధించిన సమాచారం ఇంకా సేకరించనున్నట్లు సమాచారం. అలాగే కమిషన్ ఛైర్మన్, మిగతా సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసి టీఎస్‌పీఎస్సీ విధి విధానాలు, అక్కడి సిబ్బంది విధులు, ఎన్ని విభాగాలున్నాయి, ఎవరెవరు ఎప్పటి నుంచి ఆయా పోస్టులలో ఉన్నారు, అరెస్టు అయిన నిందితులు ఆయా విభాగాలలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే కీలకమైన స్టేట్‌మెంట్‌ను తీసుకోనున్నారు ఆ బృందం అధికారులు.