ఫాస్ట్‌పుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని మెక్‌డొనాల్డ్స్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. కంపెనీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీల్ జర్నల్ కథనం ప్రచురించింది. సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులలో కొంతమందికి ఉద్వాసన తప్పదంటూ పేర్కొంది. ఉద్యోగులకు మెక్‌డొనాల్డ్స్ కంపెనీ గత వారం ఈ-మెయిల్ చేసిందని .. అందులోనే లేఆఫ్స్‌కు సంబంధించి సూచనప్రాయంగా తెలియజేసిందని వాల్ స్ట్రీల్ జర్నల్ తెలిపింది.
‘సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుంచే పనిచేయాలంటూ మెక్ డొనాల్డ్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు సూచించింది. ఈ వారంలో షెడ్యూల్డ్ మీటింగ్స్ మొత్తం రద్దు చేసుకోవాలని కోరింది.’ అని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విటర్, ఎరిక్సన్, ఫిలిప్స్, యాహూ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇంకా తొలగిస్తున్నాయి కూడా.