ఎట్టకేలకు ఉదయం నుండి కొనసాగుతున్న బండి సంజయ్ అరెస్ట్ పై సస్పెన్స్ వీడింది. కరీంనగర్ లోని ఇంటిలో ఉదయం బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హనుమకొండ లోని కోర్టు కు హాజరుపరిచారు. కాసేపటి క్రితమే జడ్జ్ ముందు హాజరుపరిచారు… అయితే కొంతసేపటి వరకు పోలీసులకు మరియు బండి సంజయ్ కు మధ్యన మాటలు జరిగాయి. బండి సంజయ్ పోలీసులు నాపై చెయ్యి చేసుకున్నారని గాయాలు చూపించే ప్రయత్నం చేయగా… పోలీసులు వాదనతో జడ్జ్ ఏకీభవించారు.
అంతే కాకుండా టెన్త్ పరీక్ష పత్రం లీక్ విషయంలో బండి సంజయ్ హస్తం ఉందని కోర్టు నమ్మింది. తద్వారా హనుమకొండ కోర్టు బండి సంజయ్ ను 14 రోజుల పాటు రిమాండ్ లో ఉంచాలని నిర్ణయించి తీర్పును ప్రకటించింది. దీనితో ఉదయం నుండీ గగ్గోలు పెట్టినా బీజేపీ నాయకులు అంతా షట్ అప్ అయిపోయారు. ఇక ముందు ముందు బీజేపీ బండి సంజయ్ ను విడిపించడానికి ఏమి ప్రయత్నాలు చేయనుంది అన్నది తెలియాల్సి ఉంది.