సీఎం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు

-

పంజాబ్ ప్రభుత్వం మండుతున్న ఎండలు నేపధ్యం లో కీలక నిర్ణయం తీసుకుంది , విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందుకు ఎండల నుంచి ఉద్యోగులకు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చాలని నిర్ణయించింది. పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పంజాబ్ సీఎం భగవత్ మన్ శనివారం తెలియచేశారు . ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లోని గవర్నమెంట్ ఆఫీసులు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు అంటే జులై 15 వరకు ఈ టైమింగ్స్‌నే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుంది.

Summer Heat Awareness Safety Tips - Carolina Cat Construction

ప్రభుత్వ ఉద్యోగులు సహా ఎంతో మందిని సంప్రదించి, వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వాడకం తగ్గి, లోడ్ భారం కూడా తగ్గుతుందన్నారు ఆయన. పంజాబ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివరాల ప్రకారం ఆ రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట వినియోగం మధ్యాహ్నం 1.30 తర్వాత మొదలవుతుంది. ఒక వేళ 2 గంటలకు ప్రభుత్వ ఆఫీసులను మూసేస్తే.. 300 నుంచి 500 మెగావాట్ల మేర పీక్ లోడ్ తగ్గించడానికి తోడ్పడుతుందని సీఎం భగవంత్ మన్ తెలిపారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని సీఎం ప్రకటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news