ఆటో డ్రైవర్‌ అవతారమెత్తిన మంత్రి హరీశ్‌రావు

-

నేడు సిద్దిపేట జిల్లాలోని రాఘవపురం పట్టణంలో ఆటో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అక్కడ ఆయన ఒక ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తారు. ఆటో కార్మికుడి డ్రెస్ వేసుకొని, ఆటో నడిపించారు మంత్రి హరీష్ రావు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా రుణం ఆయన తీర్చుకోలేననిపిస్తోందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. పదవులు ఉండొచ్చు, పోవచ్చు కానీ ప్రజల ప్రేమ వెలకట్టలేనిది అని వెల్లడించారు. తోలు వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తోందన్న మంత్రి.. మాటల్లో చెప్పలేకపోతున్నాని, కళ్లలో నీళ్లొస్తున్నాయి అని భావోద్వేగానికి గురయ్యారు మంత్రి హరీశ్.

ఆటో డ్రైవర్‌ అవతారమెత్తిన మంత్రి హరీశ్ రావు (వీడియో)

ఇంకో సభ లో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్ధిపేట జిల్లా పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చని వెల్లడించారు. కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సీపీఆర్ విధానం ఎంతో అవసరమని అన్నారు. దేశ వ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉన్నదని తెలిపారు. దేశంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 15 లక్షల మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో 4 వేల మంది చనిపోతున్నారని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news