శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుండే… శివుడిని ఎందుకు చూడాలి..?

-

మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు మన పెద్దలు చెప్పినట్లు పాటిస్తూ ఉంటాము. ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు కూర్చోవడం ప్రదక్షిణం చేయడం ఇలా.. అలానే పెద్దలు మనకి నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకోవాలని అంటూ ఉంటారు. ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే మొదట మనం నంది కొమ్ముల మధ్య నుండి శివుడును చూసి మన కోరికలను చెప్తూ ఉంటాము. అలానే చెయ్యాలి కూడా.

అయితే మామూలుగా ఏ దేవుడినైనా మనం దర్శనం చేసుకోవాలంటే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాం అక్కడ దర్శనం చేసుకుని వచ్చేస్తాం. కానీ శివాలయంలో మాత్రం ఎందుకు నంది కొమ్ముల మధ్య నుండి మనం శివుడిని దర్శనం చేసుకోవాలని చూస్తే… త్రిమూర్తుల్లో పరమేశ్వరుడు ఒకరు. పరమేశ్వరుడికి విగ్రహ రూపం ఉండదు. లింగ రూపంలో మాత్రమే శివుడు కనపడతాడు.

శివుడు లయకారుడు. శివుడు మూడవ కన్ను కనుక తెరిస్తే సృష్టి అంతమవుతుంది అంతటి శక్తి పరమశివుడికి ఉంటుంది కాబట్టి నేరుగా మనం దర్శించుకోకూడదు. అలా చేయడం మంచిది కాదు. అందుకనే ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల మధ్య నుండి మనం శివుడిని చూడాలి. అలా శివలింగానికి నమస్కారం చేసుకుని మన కోరికలు చెప్పుకోవాలి అందుకనే శివ లింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది కొమ్ముల మధ్య నుండి దర్శనం చేసుకోవాలి ఇలా చేసుకుంటే మంచి కలుగుతుంది అంతేకానీ నేరుగా మనం పరవ శివుడిని దర్శనం చేసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news