హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బౌద్ధ గురువుల ప్రార్ధనల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ మహా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో పేరుతో నూతన తెలంగాణ సచివాలయాన్ని ఈనెల 30వ తేదీన ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు.
అంబేద్కర్ విశ్వ మానవుడు, ఆయన ఆలోచన విశ్వజనీయమైనది, ఆయన రచించిన రాజ్యాంగం సంవత్సరాలు దాటిపోతుంది, జయంతులు జరుపుకుంటూ పోవడమేనా..? కార్యాచరణ ఉందా..? ప్రశ్నించుకోవాలన్నారు. విశ్వ మానవుని విశ్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్టించుకున్నాం.. అంబేద్కర్ ని చూస్తూ అధికారుల మనసులు ప్రభావితం కావాలన్నారు. అంబేద్కర్ విగ్రహం కాదు విప్లవం అని.. తెలంగాణ కలల సహకారం చేసిన చైతన్య దీపిక అన్నారు సీఎం కేసీఆర్.