మరో ఐదు రోజులు పొడిగించిన విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ గడువు

-

ఆర్ఐఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ల దాఖలు గడువును ఇంకో ఐదు రోజులు పాటు పెంచింది. పలు సంస్థల నుంచి ఇంకా బిడ్లు వస్తాయనే అంచనాతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ఇటీవల ఈఓఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయగా… ఇప్పటిదాకా 22 బిడ్లు దాఖలైనట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఈఓఐకి స్పందించి 6 విదేశీ సంస్థలు కూడా బిడ్లు వేయడం జరిగింది. ఉక్రెయిన్ దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి కూడా బిడ్డింగ్ వేసినట్టు సమాచారం.

Visakha Steel Plant bidding time limit extended

ఈ బిడ్డింగ్ లో జేఎస్ డబ్ల్యూ, జేఎస్పీఎల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు పాలుగొనడం విశేషం. సింగరేణి కాలరీస్ నుంచి ఇంకా బిడ్ దాఖలు కాలేదు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనడంపై సింగరేణి సంస్థ మరికొంత సమయం తీసుకోనున్నట్టు సమాచారం.
విశాఖకు చెందిన పలు కంపెనీలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్డింగ్ లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొనడం జరిగింది. ఆయన ఓ ప్రైవేటు సంస్థ తరఫున బిడ్ దాఖలు చేశారు. ఆయన స్టీల్ ప్లాంట్ సీజీఎం సత్యానంద్ కు బిడ్డింగ్ పత్రాలు సమర్పించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news