కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

-

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై పలు విషయాల్లో మండిపడి ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్తా, నేడు అమిత్ షా కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాన్ని 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని హోం శాఖ వెల్లడించింది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో క్వశ్చన్ పేపర్ రానుంది.
కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని ప్రజలపై రుద్దుతోందని పలువురు సీఎంలు, మంత్రులు మండిపడుతున్నారు.

No TV for six months, study hard, KTR tells youngsters - Telangana Today

స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హిందీని బలవంతంగా రుద్ద వద్దంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా గతంలో కేంద్రాన్ని కోరారు. దీనికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభించింది. ఇటీవల పెరుగు ప్యాకెట్లపై దహీ అని రాయాలనే నిబంధనపై కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ 13 స్థానిక భాషల్లో సీఆర్పీఎఫ్ పరీక్ష నిర్వహణకు సిద్ధపడుతోంది. ‘సీఆర్పీఎఫ్ పరీక్షను తెలుగుతో పాటు 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు గాను.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నా ధన్యవాదాలు. ఇది వేలాది మంది తెలుగు మాట్లాడే రాష్ట్రాల అభ్యర్థులకు తప్పకుండా ఉపయోగపడుతుంది’ ఆయన ట్విట్టర్‌లో తెలియచేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news