వాట్సాప్, టెలిగ్రామ్‌లో నకిలీ యాప్ చక్కర్లు ….ఐఆర్‌సీటీసీ హెచ్చరిక

-

తాజాగా ప్రజలకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఓ హెచ్చరిక జారీ చేసింది. ఐఆర్‌సీటీసీ పేరిట వైరల్ అవుతున్న ఓ నకిలీ యాప్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఐఆర్‌సీటీసీకనెక్ట్ పేరిట ఈ యాప్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్ వాట్సాప్, టెలిగ్రామ్‌లో చక్కర్లు కొడుతోందని తెలిపింది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారి ఫోన్లు సైబర్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

IRCTC warn users of a fake app circulating on whatsapp and telegram

ఈ యాప్ ద్వారా నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారం, యూపీఐ, బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ అధికారులమని చెప్పుకుంటూ కొందరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లపై ఒత్తిడి తెస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. కాబట్టి.. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌ నుంచి మాత్రమే ఐఆర్‌సీటీసీ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news