వివేక హత్య కోసం రూ. 40 కోట్ల డీల్… కీలక సమాచారం బయట పెట్టిన సీబీఐ!

-

కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో గత కొద్దీ రోజుల వరకు అంత స్పీడ్ లేకున్నా.. వారం రోజుల నుండి మాత్రం జెట్ స్పీడ్ లో విచారణ మరియు కేసును సిబిఐ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపింది. ఇక నెస్ట్ టార్గెట్ ఎంపీ అవినాష్ రెడ్డి అని తెలిసిందే. అయితే ఈయనను విచారణకు రమ్మని సిబిఐ నోటీసులు ఇస్తున్నా రాకుండా.. తెలంగాణ హై కోర్ట్ లో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశాడు. దీనికి సంబంధించిన విచారణ నిన్నటి నుండి ఈ రోజుకు వాయిదా పడగా.. కాసేపట్లో విచారణ జరగనుంది.

కానీ సిబిఐ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హై కోర్ట్ లో పిటీషన్ వేసి కాసేపటి క్రితమే సిబిఐ తరపున న్యాయవాది గట్టిగ వాదించారు. అందులో భాగంగానే కీలక విషయం బయట పెట్టారు. సిబిఐ తరపు లాయర్ మాట్లాడుతూ ఈ కేసులో వివేకా హత్య కోసం 40 కోట్ల డీల్ జరిగిందని.. దీనికి మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అందుకే అవినాష్ రెడ్డిని విచారణ చేయాలని చెప్పింది. మరి విచారణలో ఏమి జరగనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news