ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసులో ట్విస్ట్..కౌంటింగ్ వీడియో పుటేజీ మిస్సింగ్

-

 

 

ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసులో ట్విస్ట్..చోటు చేసుకుంది. కౌంటింగ్ వీడియో పుటేజీ మిస్సింగ్ అయింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ 2018లో హై కోర్ట్ ను ఆశ్రయించారు కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. డాక్యూమెంట్లు కోర్టు అందించే క్రమంలో జరిగిన పరిణామాలపై, వీడియో పుటేజీ మిస్‌ అవడంపై ఈనెల 26న జరిగే విచారణలో హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. రీ కౌంటింగ్ జరపాలి…తాళాలు పోయిన ఘటన లో సంబంధిత అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ అభ్యర్ధి, పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.

 

 

17A,17B,17C ఫామ్స్ భద్ర పరిచిన బాక్స్ లకు కేవలం నాలుగింటికే తాళాలు ఉన్నాయి… వాటికి కూడా సీల్‌ లేదు మిగతా బాక్స్‌లకు తాళాలు లేవు. వాటిని పగులగొట్టారు.2018 ఎన్నికల్లో కౌంటింగ్ చేసిన అధికారులు 17ఏ,17సి సామగ్రి పొందుపరచలేదన్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నాలుగున్నర సంవత్సరాలుగా తాళాలు లేకపోవడంతో జరగాల్సిన మాల్ ప్రాక్టీస్ జరిగిపోయింది…ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన వీడియో, సీసీ ఫుటేజ్ లేదని, దొరకడం లేదని కలెక్టర్ చెప్పారన్నారు.

ఎన్నికలు జరిగిన తర్వాత నోటిఫైడ్ ఏరియా ఈవీఎం లు భద్రపరచలేదు.ఈవిఎంలు భధ్రపరచిన స్ట్రాంగ్‌ రూం ఉన్న వి.ఆర్.కే కాలేజీ ఎంట్రన్స్ నుండి స్ట్రాంగ్ రూమ్ వరకు ఉండాల్సిన ఒక్క సీసీ టీవీ ఫుటెజీ కూడా లేదని వెల్లడించారు. కౌంటింగ్ వీడియో పుటేజీ లేదు… స్ట్రాంగ్ రూం కు భద్రత కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ పుటేజీ లేదు… స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ సీల్ వేయలేదన్నారు. 209 పోలింగ్ బూత్ కు సంబంధించి 17C ఫామ్స్ కి సీల్ లేదు.అన్ని విషయాల్లో ల్యాప్స్ తప్పిదాలు ఉన్నాయనేది తేటతెల్లం అయింది కాబట్టి రీకౌంటింగ్ చేసేలా కోర్టు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. న్యాయం గెలుస్తుంది కోర్టుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news