ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశాన్ని ఇష్టం వచ్చినట్లు ఫలిస్తోందని విపక్షాలు అన్నీ మూకుమ్మడిగా వాదనలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తామంటూ విపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే పాలనలో చాలా మార్పులను తీసుకువస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా GST ని అమలులోకి తీసుకురావడం వలన ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో తెలిసిందే, ఇందులో కొన్ని కీలక మార్పులు తీసుకువస్తామని మాటిచ్చారు.
ఈ GST అనేది కేవలం ధనికులకు మాత్రమే తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఇందులో 5 రకాల పన్ను విధానాలు అమలులో ఉన్నాయి. ఈ GST గురించి సరైన అవగాహన లేకపోవడం వలన చాలా మంది చిన్న వ్యాపారస్తులు నస్టపోతున్నారు. అందుకే మమ్మల్ని మీరు అధికారంలోకి తీసుకువస్తే కనీస పన్ను విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు.