వావ్: రెండేళ్లు గడుస్తున్నా టాప్ లోనే MR. IPL

-

ఇండియా వేదికగా ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ లో ఎన్ని సీజన్ లు గడిచినా ఎప్పటికీ కొందరి ఆటగాళ్ల పేర్లు ప్రేక్షకుల మదిలో ఆలా గుర్తుండిపోతాయి. అటువంటి వారిలో ఒకరే సురేష్ రైనా.. చెన్నై తరపున ఎక్కువగా ఆడుతూ వచ్చిన రైనా వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తూ చెన్నైకు మరపురాని ఎన్నో విజయాలను అందించాడు. కానీ గత రెండేళ్లుగా ఐపీఎల్ ఆడకపోవడంతో ఇప్పుడు కనుమరుగైపోయాడు. అయినప్పటికీ ఐపీఎల్ రికార్డ్స్ లో ఒక అంశంలో మాత్రం ఇంకా టాప్ లో ఉన్నాడు.

ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లను అందుకున్న ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా 109 క్యాచ్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలలో ముంబై మాజీ ఆటగాడు పోలార్డ్ 103 క్యాచ్ లతో రెండవ స్థానంలో మరియు విరాట్ కోహ్లీ 101 క్యాచ్ లతో మొదటి స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news