వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు “షర్మిల” జైలుపాలు …!

-

ఈ రోజు ఉదయం నుండి అత్యంత నాటకీయంగా జరిగిన పరిణామాలు చివరికి తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జైలుపాలు చేశాయి. షర్మిల పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెపై కేసులు నమోచు చేయడం జరిగింది. కాగా ఆ తర్వాత కొన్ని సెక్షన్ ల కింద షర్మిలపై మరియు ఆమె కార్ డ్రైవర్ పై కేసులు పెట్టి.. ఈమెను నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లే ముందు గాంధీ హాస్పిటల్ లో ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్ట్ లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.

ఈమె చేసింది ముమ్మాటికీ తప్పే అని నమ్మిన నాంపల్లి కోర్ట్ ఈమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈమెను చంచల్ గోడ జైలుకు తరలించారు. కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం వచ్చే నెల 8వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సి ఉంది. ఈలోపు షర్మిల తరపు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news